Abn logo
Sep 26 2021 @ 09:09AM

సినీ నటి మీరా మిథున్‌కు బెయిల్‌

అడయార్‌(చెన్నై): దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన సినీనటి మీరా మిథున్‌కు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు అభిషేక్‌ను చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆగస్టు నెల 14వ తేదీన కేరళ రాష్ట్రంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి వారిద్దరూ జైల్లో ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వీరికి నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత సీసీబీ కార్యాలయానికి వచ్చి రిజిస్టరులో సంతకం చేసి వెళ్ళారు.