సినీ దర్శకుడు నంద్యాల రవి కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-15T06:43:42+05:30 IST

నిడమర్రు మే 14: దర్శకుడు, రచయిత నంద్యాల రవి (42) కరోనాకు బలయ్యారు.

సినీ దర్శకుడు నంద్యాల రవి  కరోనాతో మృతి
దర్శకుడు, రచయిత నంద్యాల రవి

 నిడమర్రు మే 14: దర్శకుడు, రచయిత నంద్యాల రవి (42) కరోనాకు బలయ్యారు. కొవిడ్‌ బారినపడి కొద్ది రోజులుగా హైదరాబాదు ప్రైవేటు  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  ‘‘ లక్ష్మీ రావే మా ఇంటికి’’ చిత్ర దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు. తర్వాత ఒరేయ్‌ బుజ్జిగా.. రచయితగా వ్యవహరించారు. అనంతరం పలు చిత్రాలకు స్ర్కిప్ట్‌లు అందించారు.  కొవిడ్‌ జయించి తిరిగి వస్తాడనుకున్న  రవి  మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రవి స్వగ్రామమైన నిడమర్రు మండలం బువ్వనపల్లిలోను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు సంతాపం తెలిపారు.


Updated Date - 2021-05-15T06:43:42+05:30 IST