Abn logo
Jul 8 2020 @ 03:05AM

‘న్యూ’స్‌

గత ఏడాది ‘సైరా’తో విజయం అందుకున్నారు దర్శకుడు సురేంధర్‌ రెడ్డి. తాజాగా ఆయన హీరో రామ్‌తో ఓ సినిమా కమిట్‌ అయినట్లు సమాచారం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో భారీ విజయం అందుకున్న రామ్‌ కోసం  ఓ మాస్‌ కమర్షియల్‌ కథ సిద్ధం చేశారట సురేందర్‌ రెడ్డి. రామ్‌ హీరోయిజం ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేేసలా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో రామ్‌ ఈ సినిమా సెట్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చు. 

చిరంజీవి పెద్ద కుమార్తె నిర్మాతగా మారనున్నారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఆమె ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. ఈ బ్యానర్‌లో న్యూ ఏజ్‌ కంటెంట్‌తో వెబ్‌ సిరీస్‌ చేస్తారని సమాచారం.

Advertisement
Advertisement
Advertisement