Advertisement
Advertisement
Abn logo
Advertisement

పల్ల వెంకన్న నర్సరీలో ‘కోతి బావకు పెళ్ళంట’

కడియం, నవంబరు 30: ప్రముఖ సినీనటుడు ఆలీ హీరోగా తెరకెక్కుతున్న ‘కోతిబావకు పెళ్ళంట’ చిత్ర షూటింగ్‌ మంగళవారం పల్ల వెంకన్న నర్సరీలో జరిగింది. దర్శకునిగా అశోక్‌కుమార్‌ వ్యవహరిస్తుండగా, బ్రహ్మానందం, సునీల్‌, తనికెళ్ళభరణి, గౌతంరాజు నటిస్తున్నట్లు  కో-ప్రొడ్యూసర్‌ మురళీకృష్ణ తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలో పాటలు, సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు.  బుల్లితెర నటి శ్రీకరుణ, ఆలీ జంటగా ఓ పాటను చిత్రీకరించారు. డిసెంబరు 1వ తేదీన ఆత్రేయపురంలో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.  పల్ల వెంకన్నకు ఆలీ నివాళులర్పించారు. 

Advertisement
Advertisement