రోగనిరోధక శక్తిని పెంచే...

ABN , First Publish Date - 2021-10-24T08:32:40+05:30 IST

దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు..

రోగనిరోధక శక్తిని పెంచే...

వింటర్‌ డ్రింక్‌

దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు డయాబెటిస్‌పై పోరాటానికి సమాయపడతాయి. జీవక్రియల రేటును మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాటానికి సహాయపడుతుంది. అదే సమయంలో జీలకర్ర జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఐబీఎస్‌ సమస్యను మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ డ్రింక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...

ఒక పాత్రలో గ్లాసు నీళ్లు పోసి కొద్దిగా దాల్చినచెక్క, ఒక చెంచా జీలకర్ర వేసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. తరువాత వడగట్టుకుని కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలుపుకొని గోరువెచ్చని డ్రింక్‌ తాగాలి. ఈ డ్రింక్‌ రోజూ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ పెరిగేందుకు ఈ డ్రింక్‌ బాగా ఉపయోగపడుతుంది.

Updated Date - 2021-10-24T08:32:40+05:30 IST