కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ABN , First Publish Date - 2021-12-07T05:02:01+05:30 IST

రెవెన్యూ అఽధికా రులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో కార్యాలయాని కి పనులపై వచ్చేవారికి తెలీటం లేదు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
సిబ్బంది లేక వెలవెలబోతున్న పర్చూరు తహసీల్దార్‌ కార్యాలయం

సమయపాలన పాటించని సిబ్బంది

వెలవెలబోతున్న తహసీల్దార్‌ కార్యాలయాలు

ప్రజలకు తప్పని వెతలు

వేటపాలెం(చీరాల), డిసెంబరు 6: రెవెన్యూ అఽధికా రులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో కార్యాలయాని కి పనులపై వచ్చేవారికి తెలీటం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవా రం వేటపాలెం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ‘ఆంధ్ర జ్యోతి’ విజిట్‌ చేయగా అనేక విషయాలు వెలుగుచూ శాయి.  తహసీల్దార్‌ సంఽధ్యశ్రీ కార్యాలయం పనిపై ఒంగోలు వెళ్లారని సిబ్బంది తెలిపారు. సీనియర్‌ అసి స్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆప రేటర్‌ మాత్రం కార్యాలయంలో విధుల్లో ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ డిప్యూటేషన్‌పై వెళ్లారు. మిగిలినవారు ఓటీఎస్‌ విధులకు సంబంధించి ఫీల్డ్‌లో ఉన్నారని కా ర్యాలయంలో ఉన్నవారు తెలిపారు. ఈక్రమంలో పలు వురు వివిధ పనులపై వచ్చిన ప్రజలు సంబంధిత అధికారులు లేకపోవడంతో ఉసూరుమంటూ వెను తిరిగారు.

 ఎప్పుడు ఉంటారో తెలీటం లేదు: దుర్గాకుమారి

నాపేరు దుర్గాకుమారి. మా అమ్మ సామ్రాజ్యం చేనేతపురిలో ఉంటుంది. ఈ ఏడాది అక్టోబరు నెలలో ఆ మె ఇల్లు అగ్నిప్రమాదానికి గురై కట్టుబట్టలతో మిగిలిం ది. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. నాకు పెళ్లయి వేరే చోట ఉంటున్నాను. ప్రమా దానికి సంబంధించి సాయం వెంటనే అందిస్తారన్నారు. అయితే ఏ సాయం అంద లేదు. మా అమ్మ ఆఫీసుకు రాలేదు. అందుకోసం నేను వచ్చాను. అయితే ఇక్కడ అధికారులు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలీటం లేదు.

పరిష్కారం కాని భూసమస్యలు

చినగంజాం, డిసెంబరు 6: రెవెన్యూ కార్యాలయాల పనుల కోసం ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేస్తున్నా పన్నులు కావడం లేదని పలువురు వాపోతున్నారు. ఏళ్ల తరబడి తిరిగినా అధికారులు ఒక్కరిపై ఒకరు చెప్పుకుంటూ భూ సమస్యలు పరిష్కరించటం లేదని, పన్నులు మానుకుని కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం

మా సోదరి శీలం పుష్పలీల భర్త భాస్కరరావు చ నిపోవ టంతో అతని పేరు మీద ఉన్న పొలాన్ని  పు ష్పలీల పేరు మీదకు మార్పు కోసం సంవత్సరన్నర నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని డి.యోహాన్‌ తెలి పారు. పెదగంజాం సర్వే నెంబరు 166, 167/10 1.66 ఎకరాల భూమి ఉంది. గత సంవ త్సరం ఆగస్టు 28న మ్యుటేషన్‌ కోసం దర ఖాస్తు చేశాం. మూడుసార్లు రిజెక్టు చేశారని, మరలా మూడుసార్లు దరఖాస్తు చేసినా ఇంతవరకు పట్టాదా రు పాసు పుస్తకం ఇవ్వలేదని తెలిపారు. పట్టాదారు పాస్తు పుస్తకం కోసం సంవత్సరం నుంచి కార్యాల యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఉప్పు గుండూరు గ్రామానికి చెందిన కాకర్ల చెంచయ్య తెలిపారు.  

రెగ్యులర్‌ అధికారిలేక అవస్థలు

చీరాలటౌన్‌, డిసెంబరు 6: చీరాల తహసీల్దార్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు అర్జీలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ మహ్మద్‌ హుస్సేన్‌ అక్టోబర్‌ 22న బదిలీ పై వెళ్లారు. అప్పటినుంచి వేటపాలెం తహసీల్దార్‌ సంధ్యశ్రీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆమె వేటపాలెంలో వి ధులు నిర్వహిస్తూ పూర్తి సమయం చీరాలకు కేటా యించలేని పరిస్థితి. ఈక్రమంలో  అర్జీదారులు పను లుకాక కార్యాలయానికి రావడమే మానుకు న్నారు. 

వేధిస్తున్న సిబ్బంది కొరత

పర్చూరు, డిసెంబరు 6:  సిబ్బంది కొరతతో ప ర్చూరు తహసీల్దార్‌ కార్యాలయం వెలవెలబోతోంది. ఉదయం 10.30 కు ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా త హసీల్దార్‌, ఉప తహసీల్దార్‌, ఎన్నికల డీటీ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీఆర్వోలను ఆయా సచివా లయాలకు పరిమితం చేయటంతో రెవెన్యూ కార్యాల యం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కీలకమైన ఆర్‌ఐతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌,  ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు అటెండర్ల పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. దీంతో కార్యాలయంలో తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌తోపాటు ఒకరిద్దరు సిబ్బంది మాత్ర మే ఉంటున్నారు.

Updated Date - 2021-12-07T05:02:01+05:30 IST