సీఐల బదిలీలు

ABN , First Publish Date - 2021-05-12T05:33:12+05:30 IST

: గుంటూరు రేంజ్‌ పరిధిలో 12 మంది సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సి.ఎం. త్రివిక్రమవర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐల బదిలీలు

నెల్లూరు(క్రైం), మే 11: గుంటూరు రేంజ్‌ పరిధిలో 12 మంది సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సి.ఎం. త్రివిక్రమవర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీసుస్టేషన్‌ సీఐ కె.వేమారెడ్డిని రేంజ్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్ధానంలో రేంజ్‌ కార్యాలయంలో ఉన్న టి.వి సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే సుబ్బారావు వేదాయపాలెం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బదిలీపై రేంజ్‌ కార్యాలయానికి వెళ్లారు. బుచ్చిరెడ్డిపాళెం సీఐ బి. సురేష్‌బాబును గుంటూరు జిల్లా పెదకాకాణి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు.

Updated Date - 2021-05-12T05:33:12+05:30 IST