పట్టణాలకు ఉపాధి కావాలి

ABN , First Publish Date - 2020-06-05T11:27:31+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని సీపీఎం, సీఐటీయూ, పట్టణ పౌర సమాఖ్య ..

పట్టణాలకు ఉపాధి కావాలి

ఉపాధి హామీ కార్మికులతో ప్రజా సంఘాల నిరసన


భీమవరం రూరల్‌/టి.నరసాపురం/ తణుకు రూరల్‌/ వీరవాసరం/ కుక్కునూరు, జూన్‌ 4 : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని సీపీఎం, సీఐటీయూ, పట్టణ పౌర సమాఖ్య సం ఘాల సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తణుకు ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేసి ఎంపిడీవో టి.సూర్యనారాయణమూర్తికి వినతిపత్రం అందజేశారు.సీపీఎం మండల కార్యదర్శి పీవీ.ప్రతాప్‌, సీఐటీ యూ జిల్లా నాయకులు అడ్డగర్ల అజయకుమారి, పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ గారరంగారావు అందరికీ ఉపాధి కల్పించాలన్నారు.భీమవరం మండలం తుందుర్రులో ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం నిరసన ప్రద ర్శన చేపట్టారు. ఉపాధి కనీస వేతనం రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.


గ్రామ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. టి.నరసాపురం ఉపాధి హామీ పని ప్రదేశంలో గురువారం కూలీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుడు తుమ్మల సత్యనా రాయణ డిమాండ్‌ చేశారు. వీరవాసరం మండలం పెర్కిపాలెం, మత్స్యపురిపా లెం, నందమూరుగరువు గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు.


లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.7500 చొప్పున మూడు నెలలపాటు అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్‌ పోతుల మృత్యుంజయ డిమాండ్‌ చేశారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో వినతిపత్రం అందజేశారు. కుక్కునూరులో కార్మికులు పనిము ట్లతో నిరసన తెలిపారు. పీఎల్‌.నర్సింహరావు, గుబ్బల గోపి, కామన మునిస్వామి, సిహెచ్‌ రామకృష్ణ, కృష్ణ, మద్దా ప్రకాశరావు, కొండేటి లాజరు, సంతోషరావు, మురాల పుర్లవతి, బొందా ప్రకాశరావు, మార్తమ్మ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అనుమోలు మురళీ, మోహనరావు, సుధారాణి, బొర్రా అలమహారాజు, మధుబాబు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-05T11:27:31+05:30 IST