Advertisement
Advertisement
Abn logo
Advertisement

లేబర్‌ కోర్టును రద్దు చేయాలని సీఐటీయూ నాయకుల ధర్నా

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. భవన నిర్మాణ, ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల23న తలపెట్టిన సమ్మెను విజయ వంతం చేయాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. నాయకులు అశోక్‌,లోకేష్‌, బాలకిషన్‌, కమలాకర్‌, రాంచం దర్‌, రవి, తిరుపతి, వెంకన్న, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement