పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-20T05:21:59+05:30 IST

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 19: రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ట్రాన్స్‌పోర్టు సంఘాలతో కలిసి జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సత్తిరాజు, ట్రాన్స్‌పోర్టు క

పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
కాకినాడలో ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 19: రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ట్రాన్స్‌పోర్టు సంఘాలతో కలిసి జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సత్తిరాజు, ట్రాన్స్‌పోర్టు కన్వీనర్‌ కె.సత్తిబాబు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇష్టానుసా రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతోందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్నారు. సీఐటీయూ జిల్లా సీనియర్‌ నేత దువ్వా శేషుబాబ్జి, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే పన్ను అంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు జీఎస్టీలో 5 రకాల స్లాబ్‌లు పెట్టారని ఎద్దేవా చేశారు. నాయకులు జి.బేబీరాణి, మేడిశెట్టి వెంకటరమణ, నీలపాట సూరిబాబు, కుంచె చిన్న, జి.కామశాస్త్రి, నాగాబత్తుల సూర్యనారాయణ, రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:21:59+05:30 IST