సిటీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం

ABN , First Publish Date - 2020-05-26T00:54:43+05:30 IST

గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో సిటీబస్సులను నడిపేందుకు సిద్ధమని టీఎస్‌ఆర్టీసీ అంటోంది.

సిటీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం

హైదరాబాద్‌: గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో సిటీబస్సులను నడిపేందుకు సిద్ధమని టీఎస్‌ఆర్టీసీ అంటోంది. ఈ మేరకు అన్నిఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ బస్సులు నడిపేందుకు తాము సిద్ధమేనని టీఎస్‌ ఆర్టీసీ అదికారులు చెబుతున్నారు. ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి అంటున్నారు. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. సిటీలో ఆర్టీసీ బస్సులునడపడానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్‌కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను సోమవారం నుంచి విధులు హాజరు కావాలంటూ కాల్‌లెటర్స్‌ వచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు. దేశీయ విమానాలు నడుస్తుండడంతో ఎయిర్‌పోర్ట్‌ వైపు బస్సులను పునరుద్దరించే దిశగా చర్యలు ప్రారంభించారు.


 ప్రభుత్వ అనుమతి వస్తే డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్స్‌ ప్రకారం బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దాంతోపాటే గ్రూటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో వంద శాతం సిబ్బందితో పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే దుకాణాలు కూడా 50శాతానికి పైగా తెరుచుకున్నాయి. దీంతో సిటీబస్సుల అవసరం కనిపిస్తోంది. ఈ కీలక సమయంలో బస్సులు నడపకుండా ఆదాయం కోల్పోవడం ఎందుకని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలను పాటిస్తూ బస్సులను నడిపేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓకే అంటే జూన్‌1 నుంచే గ్రేటర్‌ పరిధిలో బస్సులు నడిచే ఛాన్స్‌ వుంది. 

Updated Date - 2020-05-26T00:54:43+05:30 IST