Abn logo
Aug 14 2020 @ 04:27AM

సివిల్‌ సర్వెంట్లు ప్రజలతో మమేకమై పనిచేయాలి

రిటైర్డ్‌ ఐఏఎస్‌ పద్మనాభయ్య

సివిల్స్‌ సాధించిన అభ్యర్థులకు సన్మానం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వెంట్లు ప్రజలతో మమేకమై పనిచేయాలి. క్షేత్రస్థాయిలో ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. టీమ్‌ వర్క్‌తోనే అద్భుత విజయాలు సాధిస్తారని రిటైర్డ్‌ ఐఏఎస్‌, పద్మభూషణ్‌, భారత ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీ కె. పద్మనాభయ్య అన్నారు. వాట్సాప్‌ గురువుగా పేరు తెచ్చుకున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శిక్షణలో సివిల్స్‌ సాధించిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయనతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ స్పెషల్‌ సెక్రటరీ సాదు నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.


ముందుగా సివిల్స్‌ సాధించిన అభ్యర్థులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్‌ సాధనలో ఇంటర్వ్యూలో మెలకువలు నేర్పించి వందలాదిమంది అభ్యర్థుల కలలను సాకారం చేస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌ను ప్రశంసించారు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి అభ్యర్థులు సివిల్స్‌ విజేతలుగా మారుస్తున్న సీపీకి అభినందనలు తెలిపారు. గతంలో సివిల్స్‌ సాధించిన విజేతలు కూడా వాట్సా్‌పలో యాక్టివ్‌గా ఉంటూ తర్వాత బ్యాచ్‌కు   సూచనలు, సలహాలు ఇస్తున్న వారిని అభినందించారు. 


సీపీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది మహారాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కలిసి మొత్తం 829 మందిలో 125 మంది అభ్యర్థులు సివిల్స్‌ విజేతలుగా నిలవడం చాలా అనందంగా ఉందన్నారు. వారిలో 14 మంది 100లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. సివిల్స్‌ విజేతలను, కార్యక్రమానికి హాజరైన వారి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం పద్మనాభయ్య, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో విజేతలను సన్మానించారు. సన్మాన కార్యక్రమానికి హజరైన విజేతల్లో దాత్రిరెడ్డి, సూర్తేజా, రవితేజ, సత్యసాయి కార్తీక్‌, మకరంద్‌, ప్రేమ్‌సాగర్‌, సల్యప్రకాష్‌, సందీ్‌పకుమార్‌, రాహుల్‌ ఉన్నారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement