వినియోగదారుల చైతన్యం తో మోసాలకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-06-11T19:48:14+05:30 IST

పెట్రోల్ బంక్ ల్లో చేతి వాటం తో వినియోగ దారులను మోసం చేస్తే శిక్ష తప్పదని పౌరసరఫరాలశాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.

వినియోగదారుల చైతన్యం తో మోసాలకు అడ్డుకట్ట

నారాయణపేట: పెట్రోల్ బంక్ ల్లో చేతి వాటం తో వినియోగ దారులను మోసం చేస్తే శిక్ష తప్పదని పౌరసరఫరాలశాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ధన్వాడ భారత్ పెట్రోలియం డీలరు శ్రీ రాఘవేంద్ర ఫిల్లింగ్ స్టేషన్ లో తనిఖీ జరగగా సేల్స్ బాయ్ ప్రమేయం వల్లే పరిమాణం లో వ్యత్యాసం తో పోలీసులకు ఫిర్యాదు అందింది.దరిమిల డీ టీ రఘునందన్ బంకు యాజమాన్యం కు సదరు వ్యక్తి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వక సూచన చేశారు. ఈ  మేరకు. నిందితునిపై తప్పకుండా పోలీసు కు ఫిర్యాదు చేస్తామని వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు. 


బంకు యాజమాన్యం గానీ నిర్వాహకులు గానీ వినియోగ దారుల పట్ల సేవా భావం తో భాధ్యత తో ప్రవర్తించాలని స్పష్టం చేశారు.పెట్రోల్ బంకు ల కేటాయింపు ను సైతం ప్రభుత్వాలు స్వయం ఉపాధి , స్వాలంన ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తాయని వివరించారు. అంతే గానీ అవక తవకలకు పాల్పడితే బంకు అనుమతి సైతం రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. వినియోగ దారుల డబ్బు కు ,, ఇంధనం కు సమ ప్రాధాన్యం గుర్తెరిగి సేవ చేయాల్సిన బాధ్యత పెట్రో డీలర్ ల పై ఉంటుందని చెప్పారు. ప్రజలు కూడా వినియోగ దారులుగా చైతన్య వంతులై ఉంటే ఎక్కడా మోసం ఊసే ఉండదు అని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-06-11T19:48:14+05:30 IST