అక్రమ బియ్యం రవాణా పై అడుగడుగునా తనిఖీ

ABN , First Publish Date - 2022-01-29T22:46:36+05:30 IST

రేషన్ బియ్యం అక్రమంగా తరలించే ముఠాల ఆట కట్టించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.

అక్రమ బియ్యం రవాణా పై అడుగడుగునా తనిఖీ

దేవరకొండ: రేషన్ బియ్యం అక్రమంగా తరలించే ముఠాల ఆట కట్టించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను రంగంలోకి దింపింది. ఈమేరకు దేవర కొండలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్ధార్ మాచన రఘునందన్ తనిఖీలు ముమ్మరం చేశారు. గత రెండు మూడు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. పదలకు చేరాల్సిన రేషన్ బియ్యం ఎలా, ఎక్కడి కి పోతున్నాయి, ఎక్కన్నుంచి వస్తున్నాయి, దేని కోసం తీసుకెళ్తున్నారు. ఇలా పలు ప్రశ్నల తో పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు. 


కొండ మల్లె పల్లి నుంచి దేవర కొండ వెళ్లే దారిలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ పలు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. జనవరి 10న ఓ వాహనం కొండ మల్లె పల్లి నుంచి దిండి లో ఉన్న ఓ మిల్లుకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే.. ఇపుడు రైస్ మిల్లుల్లో కనీస మద్దతు ధర కింద ప్రభుత్వo సేకరించిన ధాన్యం సైతం కస్టమ్ మిల్లింగ్ బియ్యం కోసం మర పట్టడం జరుగుతోంది. దీంతో ఆయా మిల్లుల్లో ఉన్న లెవీ బియ్యం భద్రత భాధ్యత కూడా ఉండటం తో.. ఏ బియ్యం ఐనా దాని వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది ఆన్నకోణం లో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఏ సరకు ఐనా లెక్కా,పత్రం ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాళ్ళు కట కటాల వెనక్కే వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు.

Updated Date - 2022-01-29T22:46:36+05:30 IST