రైతుకు అధికారి ఆత్మీయ భరోసా

ABN , First Publish Date - 2021-06-11T22:57:38+05:30 IST

రైతుకు ఓ అధికారి ఆత్మీయ భరోసా కల్పించారు. పౌరసరఫరాలశాఖ అధికారి దారిన వెళ్తూ..వడ్లు బస్తాల్లో నింపుతున్న ఓ రైతు వద్ద ఆగాడు.పెద్దన్నా.!

రైతుకు అధికారి ఆత్మీయ భరోసా

నారాయణపేట: రైతుకు ఓ అధికారి ఆత్మీయ  భరోసా కల్పించారు. పౌరసరఫరాలశాఖ అధికారి దారిన వెళ్తూ..వడ్లు బస్తాల్లో  నింపుతున్న ఓ రైతు వద్ద ఆగాడు.పెద్దన్నా.! ఎలా ఉన్నారు. వడ్లు మిల్లుల్లో తీసుకుంటున్నారా..లేదా. ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆప్యాయంగా ఆరా తీశారు. శుక్ర వారం నాడు నారాయణ పేట జిల్లా మరికల్ నుంచి ఆత్మకూర్ వెళ్లే మార్గం లో నర్వ వద్ద రోడ్డు మీద వడ్లు బస్తాల్లో నిపుతున్న ఓ రైతును. ఆ దారిన స్థానిక రైస్ మిల్లు తనిఖీ కి వెళ్తున్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఆత్మీయంగా పలకరించారు.వడ్ల నాణ్యతను, రైతుల కు మిల్లుల పట్ల అవగాహన కలిగించారు. క్షేత్ర స్థాయిలో వడ్లు మిల్లు కు చేరడానికి ఎంత సమయం పడుతుంది ఆన్న విషయం పరిశీలించారు. తదనంతరం రాంపూర్ గేటు వద్ద ఉన్న రైస్ మిల్లు ను తనిఖీ చేశారు.


ఈ సందర్బంగా రఘునందన్ మాట్లాడుతూ మిల్లర్లు సాధ్యమైనంత త్వరగా వడ్లను మర ఆడించి ప్రభుత్వానికి అప్పగించితే, అంతే త్వరగా రైతు నుంచి ధాన్యాన్ని వెంటనే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మిల్లర్లు వడ్ల మిల్లింగ్ కు సంభందించి సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు మిల్లు వద్ద అందు బాటులో ఉంచాలని సూచించారు. నర్వ , మరికల్, తదితర ప్రాంతాల రైతుల నుంచి సేకరించే ధాన్యం సురక్షిత నిల్వ కోసం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు నిర్వాహకులతో మాట్లాడారు. మరికల్ తాసిల్దార్ సూచన మేరకు వడ్ల నిల్వ కు తగిన స్థలం కేటాయించేందుకు ఈ మేరకు అంగీకరించారు.

Updated Date - 2021-06-11T22:57:38+05:30 IST