Abn logo
Sep 25 2021 @ 02:04AM

సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన మదనపల్లె

అమ్మానాన్నతో సాయిమానస

48వ ర్యాంకు సాధించిన సాయిమానస

ఫారిన్‌ సర్వీసు అంటే ఇష్టమన్న ర్యాంకర్‌


మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 24: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో మదనపల్లెకు చెందిన ఎన్‌.సాయిమానస 48వ ర్యాంకు సాధించారు.పట్టణంలోని కమ్మగడ్డవీధికి చెందిన దంపతులు ఎన్‌.నందకుమార్‌,భరణిదేవి పెద్ద కుమార్తె అయిన సాయిమానస ఆదినుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చారు.నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీలో చదివిన సాయిమానస, బెంగళూరులోని పీఈఎస్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్సులో ఇంజనీరింగు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.ఢిల్లీలోని చండ్రరంజన్‌ కోచింగ్‌ సెంటర్లో ఐదునెలల పాటు పొలిటికల్‌ సైన్సు సబ్జెక్టులో కోచింగ్‌ తీసుకున్నారు.సివిల్స్‌లో మొదటి సారి ప్యాటర్న్‌ తెలుసుకునేందుకు ప్రయత్నించి ప్రిలిమ్స్‌ వరకు మాత్రమే వెళ్లారు. రెండో ప్రయత్నంలో 48వ ర్యాంకు సాధించారు.ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ ఎంపిక చేసుకుని దేశానికి తన వంతు సేవ చేయాలని భావిస్తున్నట్లు సాయిమానస వెల్లడించారు. గతంలో మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థ సభ్యురాలిగా సాయిమానస పనిచేశారు. కాగా సాయిమానస తండ్రి నందకుమార్‌ ప్రస్తుతం మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఉండగా, ఆమె మేనత్త రాటకొండ శోభ మదనపల్లె ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు.