టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-29T20:32:42+05:30 IST

టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి

టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: టీటీడీ కేసు విచారణలో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. కేసు విచారణ సమయంలో సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని తెలిపారు.   


‘‘పూజలు సక్రమంగా జరగకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరు. ఆయన మహిమలు అందరికీ తెలుసు‘‘ అని సీజేఐ అన్నారు. అయితే అసలు పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు  వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-29T20:32:42+05:30 IST