Abn logo
Jun 11 2021 @ 16:56PM

రాజ్‌భవన్‌కు బయలుదేరిన సీజేఐ ఎన్వీ రమణ

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సీజేఐ ఎన్వీ రమణ బయటకు వచ్చారు. కాసేపు తనను కలవడానికి వచ్చిన వారితో ఆయన ముచ్చటించారు. గోనుగుంట్ల కొటేశ్వర్‌రావు మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా ఆయన రాజ్‌భవన్ వెళ్లారు. రాజ్‌భవన్‌లో సీజేఐకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై  ఘన స్వాగతం పలకనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి కావడంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు.


Advertisement
Advertisement
Advertisement