Abn logo
Jun 11 2021 @ 16:20PM

నగరానికి చేరుకున్న సీజేఐ.. ఘనస్వాగతం

హైదరాబాద్‌: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీజేఐకు ఘన స్వాగతం లభించింది. చీఫ్ జస్టిస్‌కు మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. హైకోర్టు సీజే హిమాకొహ్లీ, సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు కూడా సీజేకు స్వాగతం తెలిపారు. మరోవైపు రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. సీజేఐ ఎన్వీరమణకు స్వాగతం పలకనున్నారు.


ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి కావడంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement