Sachin కాదంటూనే సెంచరీ కొట్టిన NV Ramana

ABN , First Publish Date - 2021-09-09T08:13:51+05:30 IST

తాను సచిన్‌ తెందుల్కర్‌ కానంటూనే సీజేఐ ఎన్వీ రమణ సెంచరీ..

Sachin కాదంటూనే సెంచరీ కొట్టిన NV Ramana

  • సెంచరీ దాటిన సీజేఐ రమణ నియామకాలు
  • మరో 12 మంది జడ్జిలకు కొలీజియం ఆమోదం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తాను సచిన్‌ తెందుల్కర్‌ కానంటూనే సీజేఐ ఎన్వీ రమణ సెంచరీ కొట్టారు.కర్ణాటక హైకోర్టుకు  పదిమంది అదనపు న్యాయమూర్తులను,  కేరళ హైకోర్టుకు చెందిన ఇద్దరు  అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సీజేఐ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సుప్రీంకోర్టు బుధవారం ఒక ప్రకటన చేసింది. ఇప్పటికే కొలీజియం వివిధ హైకోర్టులలో 82మంది  న్యాయమూర్తులను, సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలను నియమించింది. తాజాగా 12మంది నియామకంతో జస్టిస్‌ రమణ ఆధ్వర్యంలో కొలీజియం ఇంతవరకు 103మంది న్యాయమూర్తులను నియమించినట్లయ్యింది.


Updated Date - 2021-09-09T08:13:51+05:30 IST