Abn logo
Oct 17 2021 @ 00:55AM

నందన్‌ గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ

గ్రామీణ సీఐ వెంకటేష్‌ సమక్షంలో రాజీ

నర్సాపూర్‌(జి), అక్టోబరు 16 : మండలంలోని నందన్‌ గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి జరిగిన దుర్గామాతా నిమజ్జనం అనంతరం ఇరు వర్గాల ప్రజలు గొడవలు చేసుకోవడంతో స్దానికులు 100 డయల్‌ చేసి గ్రామస్దులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మహిళలకు మాటా మాటా పెరిగి ఘర్షణలు జరగంతో  గ్రామస్దులందరూ ట్రాక్టర్ల ద్వారా పోలీస్‌స్టేషన్‌ చేరుకుని అల్లర్లకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు బైటాయించారు. ఎస్సై వెంకటరమణ బందోబస్తులో ఉండటంతో గ్రామీణ సీఐ వెంకటేష్‌ పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని నందన్‌ గ్రామస్దులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఇరువర్గాల ప్రజలను శాంతింపజేయటంతో ఇరు వర్గాలు పీఎసీఎస్‌ డైరెక్టర్‌ ఆయిటి మహేష్‌, బామ్ని(బి) సర్పంచ్‌ భర్త దేవోళ్ళ పోశెటి, కూన రవి సమక్షంలో రాజీ కావడంతో ఇకనుండి కలిసి ఉంటామని ఇరువర్గాల ప్రజలు లిఖిత పూర్వకంగా సంతకాలు చేసి రాజీ పత్రాన్ని ఎస్సై వెంకటరమణకు అందజేశారు. పోలీసులు నందన్‌ గ్రామంలో న్యాయ సదస్సులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సర్పంచ్‌ గుమ్ముల సురేష్‌నందన్‌ అన్నారు.