Abn logo
Feb 23 2021 @ 06:49AM

చాట్ దుకాణం దగ్గర వివాదం... మార్కెట్ అంతా రణరంగం!

బాగ్‌పత్: యూపీలోని బాగ్‌పత్ జిల్లాలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం రణరంగంగా మారింది. చాట్ దుకాణం దగ్గర కూర్చోవడంపై మొదలైన గొడవ మహా సంగ్రామాన్ని తలపించింది. వివరాల్లోకి వెళితే బడౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ బజారులో రెండు చాట్ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. 

అక్కడికి వచ్చిన ఒక వినియోగదారునితో... తమ దుకాణం దగ్గర కూర్చోమంటే తమ దుకాణం దగ్గర కూర్చోవాలని ఇరు దుకాణాల యజమానులు కోరారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. క్షణాల్లో ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలతో తలపడ్డారు. ఈ గొడవ కారణంగా మార్కెట్ అంతా దద్దరిల్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా రకరకాలుగా ప్రతిస్పందిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నేత... ‘న్యాయ వ్యవస్థకు మంగళం పలికిన ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్’ అనే కామెంట్ రాశారు.

                                         ‘Awet Wedi Teklu’ సౌజన్యంతో...

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement