3, 4, 5 తరగతుల విలీనం విరమించాలి

ABN , First Publish Date - 2022-01-25T06:27:52+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే విరమించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

3, 4, 5 తరగతుల విలీనం విరమించాలి
యూటీఎఫ్‌ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు, ఇతర ప్రతినిధులు

యూటీఎఫ్‌ రాష్ట్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌

విశాఖపట్నం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే విరమించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం జగదాంబ జంక్షన్‌ దరి సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు  రెండో రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల డ్రాపౌట్స్‌ పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నబ్బాయ్‌ మాట్లాడుతూ పీఆర్సీపై పోరాటం కొనసాగిస్తామన్నారు. తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను  నిలిపియాలని కోరారు. 

నూతన కార్యవర్గం

యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా గొంది చిన్నబ్బాయ్‌, ప్రధాన కార్యదర్శిగా టి.అప్పారావు తిరిగి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా దాసరి నాగేశ్వరరావు, సహాయ అధ్యక్షులుగా రొంగలి ఉమాదేవి, కొత్తపల్లి రాంబాబు, కోశాధికారిగా టీఆర్‌ అంబేడ్కర్‌, జిల్లా కార్యదర్శులుగా జె.రాజేశ్‌, ఎ.పైడిరాజు, కె.రఘునాఽథ్‌, జి.అప్పలరాజు, పోలిమెర చంద్రరావు, ఎం.హరికృష్ణ, ఎ.సత్యకళ, జీఎస్‌ ప్రకాశరావు, ఎం. ధర్మారావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్‌లుగా వి.శ్రీలక్ష్మి, కె.రాజేంద్ర, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎం.రామకృష్ణలను ఎన్నుకున్నారు. కాగా, ఎన్నికల అఽధికారిగా వి.మహేశ్‌  వ్యవహరించారు. 

















 

Updated Date - 2022-01-25T06:27:52+05:30 IST