ఒకటో తేదీ నుంచి తరగతులు

ABN , First Publish Date - 2021-06-22T05:28:28+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తరగతుల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. విశ్వవిద్యాలయంతో పాటు అ నుబంధ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒకటో తేదీ నుంచి తరగతులు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు

మూడు వారాల తరగతుల అనంతరం పరీక్షల నిర్వహణ

ఏర్పాట్లు చేస్తున్న  వర్సిటీ అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిది): తెలంగాణ విశ్వవిద్యాలయంలో తరగతుల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. విశ్వవిద్యాలయంతో పాటు అ నుబంధ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా మూడు వారాల పాటు తరగతులను నిర్వహించనున్నా రు. విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో తరగతులు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలకు అ నుగుణంగా క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో మౌలిక వసతులు సమకూర్చుకుని తరగతులు నిర్వహి ంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వల్ల గడిచిన కొన్ని నెలలుగా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ, పీజీ తరగతులను నిర్వహించలేదు. కొన్ని నెలలు ఆన్‌లైన్‌ లో క్లాస్‌లను నిర్వహించారు. కరోనా తీవ్రత పెరగడ ంతో గడిచిన రెండు నెలలుగా తరగతులను నిర్వహి ంచడం లేదు. లాక్‌డౌన్‌తో మొత్తం కార్యకలాపాల ను నిలిపివేశారు. సెలవులను ప్రకటించారు. ప్ర భుత్వ ఆదేశాల ప్రకారం జూలై 1 నుంచి తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇవ్వడంతో విశ్వవిద్యాలయం అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు భిక్కనూర్‌లో ని పీజీ సెంటర్‌ అధ్యాపకులతో ఇప్ప టికే సమావేశాన్ని నిర్వహించారు. తరగతుల నిర్వాహణ చర్యలను చేపట్టారు. విశ్వవిద్యాలయంపరిధిలోని 125 అనుబ ంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో నేరుగా తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లకు లేఖలను పంపారు. వారితో సమావేశాలను నిర్వహిస్తున్నా రు. అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం డిగ్రీ, పీజీ పరీక్షలు త్వరగా నిర్వహించాల్సి ఉండడంతో జూలైలో మూడు వా రాల పాటు తరగతులు నిర్వహించనున్నారు. తదనంత రం డిగ్రీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రతి యేటా జూన్‌లోపే వార్షిక పరీక్షలు

విశ్వవిద్యాలయం అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రతి సంవత్సరం జూన్‌లోపే వార్షిక పరీక్షలను నిర్వహించేవారు. జూలై లోపు ఫలితాలను ప్రకటించేవారు. గడిచిన సంవత్సరకాలంగా కరోనా తీవ్రత ఉండడంతో అకాడమి క్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలను నిర్వహించడంలేదు. త రగతులు సక్రమంగా జరగకపోవడం వల్ల పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతోంది. ఈ సంవత్సరం కూడా కరోనా తీవ్రత ఇప్పుడిప్పుడే సర్దుకుంటడంతో పరీక్షలను నిర్వహి ంచేందుకు విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధమవుతున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించకముందే విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాల్లో సమస్యలు ఏ ర్పడే అవకాశం ఉండడంతో జూలైలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుబంధ అ న్ని కళాశాలలు ఒకటే క్యాలెండర్‌ పాటిస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వల్ల కొన్ని ప్రైవేటు కళాశాలల్లో టీచింగ్‌ స్టాఫ్‌ను తగ్గించడం వల్ల వారి వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు మళ్లి తీసుకుని తరగతులు నిర్వహి ంచేవిధంగా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం అ ధికారులు ఆదేశాలను ఇచ్చారు. బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ అధికారులకు సమావేశాలను నిర్వహించారు. ఉన్నత విద్యామ ండలి ఆదేశాల ప్రకారం నియమిత సిలబస్‌కు అనుగుణంగా తరగతులు నిర్వహణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం కొత్త కో ర్సులను ప్రారంభించేందుకు చర్యలను చేపడుతున్నారు. విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

దరఖాస్తుల స్వీకరణ

డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త దరఖాస్తులను కూడా తీసుకునేందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ స్టాఫ్‌ తక్కువగా ఉన్నా.. అకాడమిక్‌ కన్సల్టెంట్స్‌తో తరగతుల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నష్టపోకు ండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. విశ్వవిద్యాలయం పరిధిలో తరగతుల నిర్వహణతో పాటు వసతి గృహాల ను తెరిచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ మొదటి వారంలో కరోనా కేసులను బట్టి వసతి గృహాల ను తెరవనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూలై 1 నుంచి తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌గుప్తా తెలిపారు. ఇ టీవల ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు రావడం తో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. డిగ్రీ, పీజీ తరగతులతో పాటు పరీక్షలు కూడా నిర్వహిస్తామని తె లిపారు. అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా తరగతులను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉపాధికి అవసరమైన కోర్సుల ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:28:28+05:30 IST