వ్యాధుల పంజా

ABN , First Publish Date - 2022-07-08T07:23:59+05:30 IST

జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరించడంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. జ్వరబాధితులు వణికిపోతూ మంచం పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, కరోనా కేసులతో పాటు సాధారణ జ్వరాలు ఎక్కువయ్యా యి.

వ్యాధుల పంజా

జిల్లాలో పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు

విస్తరిస్తున్న డెంగ్యూ, మలేరియా

ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీ

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే

లక్షణాలు ఉన్నవారందరికీ చికిత్సకు ఏర్పాట్లు

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

నిజామాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ, మలేరియా  జ్వరాలు విస్తరించడంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. జ్వరబాధితులు వణికిపోతూ మంచం పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, కరోనా కేసులతో పాటు సాధారణ జ్వరాలు ఎక్కువయ్యా యి. జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలు ఉం డడంతో అనేక మంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఈ కేసులు సాధారణంకంటే పదిశాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. జ్వరాలతో పాటు కరోనా కేసులు కూడా ప్రబలుతుండడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

19 డెంగ్యూ కేసుల నమోదు

జిల్లాలో ఇప్పటి వరకు 19 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌ నగరం పరిధిలోని ఈ కేసులన్నీ ఎక్కువగా నమోదు కావడంతో మున్సిపాలిటీ పరిధిలో చర్య లు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలోని ఆసుపత్రుల్లో ఓపీ పెరుగుతోంది. పీహెచ్‌సీల నుంచి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వరకు రోగులతో నిండిపోతోంది. 

పెరుగుతున్న కరోనా కేసులు 

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కేసు లు కూడా భారీగా పెరుగుతున్నాయి. జి ల్లాలో ప్రతిరోజూ పదికి పైగా కేసులు వస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారికి మందులను పంపిణీ చేస్తున్నారు. కొంతమంది లక్షణాలు ఉన్న ఆసు పత్రులకు రాకుండానే ఇతర మా ర్గాల్లో మందులను తెచ్చుకుని వాడుతున్నారు. జిల్లాలో వ్యాప్తి బా గా పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజూ 200 పైగా టెస్టులు నిర్వహిస్తుండగా 10 నుంచి 12 కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

 నేటి నుంచి ఇంటింటి సర్వే

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో పాటు డెం గ్యూ, కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో శుక్రవారం నుంచి ఈ నెల 15వరకు ఇంటింటి సర్వే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశా వర్కర్ల ద్వారా పది రోజుల పా టు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరి ధిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ జ్వరాలు వచ్చిన వారిని గుర్తించి వారికి కావాల్సిన మందులను అందిస్తారు. దోమ తెరలు ఎంతమంది వాడుతున్నారు. ఏ ఇంటి పక్క నీటి నిల్వలు ఉన్నాయి. దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు వంటి అంశాలను పరిశీలించి నమోదు చేస్తారు. సర్వే వివరాలను గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులకు అందిస్తారు. ప్రతి రోజూ వివరాలను పీహెచ్‌సీ పరిధిలోని మెడికల్‌ ఆఫీసర్‌కు అంది స్తారు. వారి ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి, కలెక్టర్‌కు సమాచారం ఇస్తారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ల ద్వారా రక్తనామూనాలు తీసుకోవడంతో పాటు వాటిని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌కు పంపించి పరీక్షలు చేయనున్నారు. కరోనా, డెంగ్యూ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతుండడం వల్ల ఈ సర్వేను చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ తెలిపారు.

Updated Date - 2022-07-08T07:23:59+05:30 IST