Abn logo
Sep 27 2021 @ 00:21AM

బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత

కదిరి తేరు బజారును శుభ్రం చేస్తున్న బీజేపీ నాయకులు


కదిరి, సెప్టెంబరు 26 : దేశ ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురష్కరించుకొని కదిరి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం నుంచి తేరు బజారు వరకు బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత కార్యక్రమాన్ని ఆదివా రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, హిందూపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నందిశెట్టిబాబు, జిల్లా కార్యదర్శి అశోక్‌, ఎస్సీ మోర్చ రాయలసీమ జోనల్‌ ఇనచార్జ్‌ ఆనంద్‌, కిసానమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, వెంకటరమణ, హిందూపురం జిల్లా యువమోర్చ కార్యదర్శి రాజ్‌కుమార్‌, లక్ష్మీనరసమ్మతి తదితరులు పాల్గొన్నారు.