స్మార్టుగా శుభ్రం!

ABN , First Publish Date - 2021-09-19T05:30:00+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ వాడటమే కానీ దాని గురించి పట్టించుకునే తీరిక చాలా మందికి ఉండదు.

స్మార్టుగా శుభ్రం!

స్మార్ట్‌ఫోన్‌ వాడటమే కానీ దాని గురించి పట్టించుకునే తీరిక చాలా మందికి ఉండదు. స్పీకర్ల దగ్గర దుమ్ము, ధూళి, ఆహారం, కూల్‌డ్రింకుల తేమ, డెడ్‌ స్కిన్‌, చెవి దగ్గర ఉండే జెర్మ్స్‌ చేరుకుంటాయి. మీకో విషయం తెలుసా.. వాస్తవానికి ఒక టాయిలెట్‌ సీట్‌ మీద ఉండేంత బాక్టీరియా స్మార్ట్‌ఫోన్‌ స్పీకర్‌ మీద ఉంటుంది. 


స్మార్ట్‌ఫోన్‌ కూడా మన ఇంట్లోలాంటి వస్తువే. కాకపోతే వాటన్నింటి కంటే సున్నితం. ఇంట్లో వస్తువుల్ని శుభ్రపరిచినట్లు మొరటుగా డీల్‌ చేస్తే కుదరదు. వాస్తవానికి కంటికి కనిపించని డస్ట్‌ పేరుకు పోవడం వల్లనే స్పీకర్లు సరిగా వినిపించవు. మొదట స్పీకర్లను కంటి అద్దాలను శుభ్రపరిచే క్లాత్‌తో మెత్తగా శుభ్రం చేయాలి. పైన మట్టి పోకుంటే ఇయర్‌ బడ్స్‌తో మెల్లగా శుభ్రం చేయాలి.


చిన్నపిల్లలు వాడే పెయింటింగ్‌ బ్రష్‌తోనూ శుభ్రం చేయవచ్చు. అయితే బ్రష్‌ సాఫ్టుగా ఉండాలి. లేకపోతే స్పీకర్లు దెబ్బతినే అవకాశం ఉంది. అంత సున్నితంగా ఉంటాయవి. టూత్‌ పిక్‌తో కూడా పేరుకుపోయిన మట్టిని మెల్లగా తొలగించొచ్చు. ఇలాగే చార్జింగ్‌ పోర్టును శుభ్రపరచుకోవాలి. ఫోను తెరను మెత్తటి గుడ్డతో శుభ్రపరచొచ్చు. వీలుంటే ఫోనుని ఇలానే శానిటైజ్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2021-09-19T05:30:00+05:30 IST