కూరగాయలు, పండ్లను శుభ్రం చేసేందుకు ‘శాఫూ’

ABN , First Publish Date - 2020-06-06T07:42:59+05:30 IST

కరోనా మహమ్మారిని తప్పించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి కూరగాయలు, పండ్లు, మాంసం

కూరగాయలు, పండ్లను శుభ్రం చేసేందుకు ‘శాఫూ’

చెన్నై జూన్‌ 5 : కరోనా మహమ్మారిని తప్పించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి కూరగాయలు, పండ్లు, మాంసం తదితర ఆహార పదార్థాల విషయంలో ఏం చేయాలనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న. వైరస్‌ లేకుండా వాటిని ఎలా శుభ్రం చేయాలి? ఇందుకోసం ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్య్సూమర్‌ గూడ్స్‌) సంస్థ కెవిన్‌కేర్‌.. ‘శాఫూ’ బ్రాండ్‌ పేరుతో 3 ఉత్పత్తులను శుక్రవారం విడుదల చేసింది. కూరగాయలను శుభ్రం చేసేందుకు శాఫూ వెజ్జీస్‌, పండ్ల కోసం శాఫూ ఫ్రూట్స్‌, మాంసాన్ని శుభ్రపరిచేందుకు శాఫూ మీట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కూరగాయలు, పండ్లపై ఎలాంటి క్రిమిసంహారకాలు, వైరస్‌ ఉన్నా ‘శాఫూ’ తొలగిస్తుందని కంపెనీ తెలిపింది. చిన్న ప్యాకెట్లు, 500 మి.లీ ప్యాక్‌లలో శాఫూ ఉత్పత్తులు రిటైల్‌ ఔట్‌లెట్లలోనూ, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలలోనూ లభిస్తాయని వివరించారు.

Updated Date - 2020-06-06T07:42:59+05:30 IST