కరోనాను దూరం చేయాలంటే వీటిని శుభ్రం చేయాలి..

ABN , First Publish Date - 2020-03-17T16:40:46+05:30 IST

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే వైరస్‌ వ్యాపించే అవకాశాలను అడ్డుకోవాలి. ఇందుకోసం తరచుగా చేతులతో తాకే వీలున్న వస్తువులను శుభ్రం చేయాలి. ఇందుకోసం ఉపయోగించే

కరోనాను దూరం చేయాలంటే వీటిని శుభ్రం చేయాలి..

ఆంధ్రజ్యోతి(17-03-2020)

శుభ్రతతో కరోనా దూరం!

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే వైరస్‌ వ్యాపించే అవకాశాలను అడ్డుకోవాలి. ఇందుకోసం తరచుగా చేతులతో తాకే వీలున్న వస్తువులను శుభ్రం చేయాలి. ఇందుకోసం ఉపయోగించే డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్స్‌ నాణ్యమైనవై ఉండాలి.


వీటిని శుభ్రం చేయాలి: తరచుగా తాకే వీలు ఉండే టేబుళ్లు, తలుపుల గడియలు, నాబ్స్‌, స్విచ్‌లు, హ్యాండిల్స్‌, ఫోన్లు, కీ బోర్డులు, మరుగుదొడ్లు, సింక్‌లు ప్రతి రోజూ శుభ్రం చేయాలి. మొదట సబ్బు నీళ్లతో వాటిని కడిగి, తర్వాత డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్స్‌తో మరోసారి శుభ్రం చేయాలి.


బ్లీచ్‌: ఇందుకోసం ఐదు టేబుల్‌ స్పూన్ల బ్లీచింగ్‌ పౌడర్‌ను నాలుగు లీటర్ల నీళ్లలో కలిపి వాడాలి. ఇంట్లో వాడే బ్లీచింగ్‌ పౌడర్‌ను అమ్మోనియా లేదా మరే ఇతర క్లీనింగ్‌ పదార్థాలతో కలిపి వాడకూడదు. 


ఆల్కహాల్‌: ఆల్కహాల్‌ కలిసిన క్లీనింగ్‌ ఏజెంట్స్‌ కరోనాను సమర్ధంగా సంహరిస్తాయి. కాబట్టి 70ు ఆల్కహాల్‌ కలిసి ఉన్నవే ఎంచుకోవాలి.


ప్రయాణాల్లో: తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే కూర్చునే సీటుతో పాటు, రైలింగ్‌ కూడా శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకూ ప్రయాణం చేస్తున్నంత సేపు వాహనం లోపలి భాగాలను ముట్టుకోకూడదు.

Updated Date - 2020-03-17T16:40:46+05:30 IST