స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలి

ABN , First Publish Date - 2022-07-05T04:41:06+05:30 IST

స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని కోరుతూ వీఆర్వోలు ఆందోళన బాట పట్టారు.

స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలి
గద్వాలలో తహసీల్దార్‌ లక్ష్మికి వినతి పత్రం అందిస్తున్న వీఆర్వోలు

- వీఆర్వోల డిమాండ్‌

- జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ముందు నిరసన

గద్వాల, జూలై 4 : స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని కోరుతూ వీఆర్వోలు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం తహసీల్దార్‌ కా ర్యాలయాల ముందు నిరసన తెలిపారు. తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. గద్వాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్వోలు నిరసన తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత వీఆర్వోలకు విధు లు, బాధ్యతలను ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌ లక్ష్మికి వినతి పత్రం అందించారు.  కార్యక్రమంలో వీఆర్వోలు భాస్కర్‌, రిజ్వాన, వెంకట్రాముడు, శివకుమార్‌, ఆనంద్‌, మద్దిలేటి  తదితరులు పాల్గొన్నారు.


ధరూరు : తమకు స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని వీఆర్‌వోలు డిమాండ్‌ చేశారు. ధరూరు తహసీల్దార్‌ కార్యాలయం సోమవారం వారు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ మహ్మద్‌ యూనుస్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వీఆర్వోలు రోహిత్‌, సుధారెడ్డి, సుశ్మ, రోహిత్‌, కేశారం, నర్సింహులు, మద్దిలేటి పాల్గొన్నారు. 


అలంపూరు : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్వోలు అలంపూర్‌ తహసీల్దార్‌ కార్యాల యం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్వోలు సుప్రియ, వెంకట్రా ముడు, రాముడు  ఉన్నారు. 


ఇటిక్యాల : సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్వోల సంఘం ఇటిక్యాల మండల నాయకు లు, సభ్యులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనతరం తహసీల్దార్‌ సుబ్ర హ్మణ్యంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్వోలు మాధవయ్య, మల్లికార్జున్‌, ఈశ్వరయ్య తదిత రులు పాల్గొన్నారు.


వడ్డేపల్లి : సమస్యలు పరిష్కరించాలని వీఆర్వోలు సోమవారం వడ్డేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ జయరాము లుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం నాయకులు నరసింహరాజు, రవీందర్‌, ఈదన్న, రామచంద్రుడు పాల్గొన్నారు. 


అయిజ : సమస్యలు పరిష్కరించాలని అయిజ తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్వోలు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ యాదగిరికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్వోల మండల అధ్యక్షుడు గురునాథ్‌, ప్రధాన కార్యదర్శి, తిరుమలేష్‌, ఆంజనేయులు, వీరబాబు, రవి, రామకృష్ణ, రామాంజనేయులు, అనంతయ్య, ఎల్లగౌడు పాల్గొన్నారు.


మల్దకల్‌ : సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మల్దకల్‌ తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ సరితారాణికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు బుడ్డన్న, వీఆర్వోలు సురేష్‌, సందీప్‌, లోకేష్‌, కవిత, తిరుమలేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


రాజోలి : సమస్యలను పరిష్కరించాలని రాజోలి తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్వోలు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ గ్రేసీబాయికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్వోలు రాముడు, లక్ష్మన్న, హనుమంతు, మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T04:41:06+05:30 IST