Cleartrip: ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లోనూ బిగ్‌ బిలియన్ డేస్.. ఆఫర్ల వాన!

ABN , First Publish Date - 2022-09-28T02:57:55+05:30 IST

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రావెల్ పోర్ట్సల్‌లో ఒకటైన క్లియర్‌ట్రిప్ (Cleartrip)

Cleartrip: ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లోనూ బిగ్‌ బిలియన్ డేస్.. ఆఫర్ల వాన!

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రావెల్ పోర్ట్సల్‌లో ఒకటైన క్లియర్‌ట్రిప్ (Cleartrip) దేశంలోనే అతిపెద్ద ట్రావెల్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు ఆఫర్లు ప్రకటించింది. మాతృసంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అనుగుణంగా ‘బిగ్ బిలియన్ డేస్’(Big Billion Days)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పండుగ సీజన్‌లో అంతర్జాతీయ విమానాలపై అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది. అంతర్జాతీయ విమాన టికెట్లను అతి తక్కువగా రూ. 6,999కి, దేశీయ విమాన టికెట్లను రూ. 999కి ఆఫర్ చేస్తోంది. అలాగే, దేశీయ హోటల్స్‌లో రూ.199కే రూమును పొందవచ్చిన ప్రకటించింది.


ఆఫర్లు ఇలా..

ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకున్న క్లియర్‌ట్రిప్(Cleartrip) అంతర్జాతీయ విమానాలపై 20 శాతం వరకు, దేశీయ విమానాలపై 35 శాతం వరకు రాయితీ అందిస్తోంది. అలాగే, దేశీయ హోటల్స్‌లో ‘బై వన్ గెట్ వన్’ (BOGO)ను ఆఫర్ చేస్తోంది. శిశువులు, చిన్నారులకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుండగా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులపై దేశీయ విమానాలకు 35 శాతం వరకు, విదేశీ విమాన టికెట్లపై 20 శాతం వరకు రాయితీ అందిస్తోంది. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై ఈ నెల 30 వరకు హోటల్స్‌లో రూముల బుకింగ్‌పై 35 శాతం వరకు రాయితీ పొందొచ్చు. త్రీస్టార్ హోటళ్లలో రూ.199 నుంచి రూములు ప్రారంభమవుతాయి. దేశీయ హోటళ్లపై 20 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 4, 5స్టార్ హోటళ్లలో వసతి రూ.1,499తో ప్రారంభం కాగా మరెన్నో ఆఫర్లను క్లియర్‌ట్రిప్(Cleartrip) ప్రకటించింది. 


‘బిగ్ బిలియన్ డేస్(Big Billion Days)ను క్లియర్‌ట్రిప్(Cleartrip) వేడుక చేసుకోవడంపై సంస్థ సీఈవో అయ్యప్పన్.ఆర్. మాట్లాడుతూ.. ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ ఫెస్టివల్‌లో ఎలాంటి అనుభవాలను పొందుతున్నారో, అలాంటి అనుభవాలనే అందించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్లు ప్రకటించినట్టు చెప్పారు. తాము అందిస్తున్న ఆఫర్లు ప్రజలకు మరింత చేరువయ్యేలా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ జంటతో భాగస్వామ్యం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఆఫర్లు సెప్టెంబరు 30 వరకు క్లియర్‌ట్రిప్ వెబ్‌సైట్, యాప్‌పై అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2022-09-28T02:57:55+05:30 IST