అరేబియా సముద్రంలో అల్పపీడనం చెన్నైకి భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2021-05-14T17:41:17+05:30 IST

అరేబియా సముద్రంలో సంభవించిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధన

అరేబియా సముద్రంలో అల్పపీడనం చెన్నైకి భారీ వర్షసూచన

చెన్నై/పెరంబూర్‌: అరేబియా సముద్రంలో సంభవించిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగాను, అనంతరం తుపానుగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో శుక్రవారం నుంచి నాలుగు రోజులు తేని, దిండుగల్‌, కోయంబత్తూర్‌, నీలగిరి, కన్నియకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, రామనాథపురం, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిస్తుందని, మిగిలిన జిల్లాలు, పుదుచ్చేరి, కారైకాల్‌ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వారు వివరించారు.

Updated Date - 2021-05-14T17:41:17+05:30 IST