శిశువు మృతి చెందాడని చెప్పిన వైద్యులు... అంతిమ సంస్కారాలు చేస్తుండగా...

ABN , First Publish Date - 2021-07-18T12:39:21+05:30 IST

జార్ఖండ్‌లోని దేవఘర్ పరిధిలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు...

శిశువు మృతి చెందాడని చెప్పిన వైద్యులు... అంతిమ సంస్కారాలు చేస్తుండగా...

దేవఘర్: జార్ఖండ్‌లోని దేవఘర్ పరిధిలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఒక గర్భిణికి డెలివరీ చేసిన అనంతరం శిశువు మృతి చెందాడని తేల్చిచెప్పారు. అయితే ఆ శిశువు సజీవంగా ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు... తప్పుడు సమాచారమిచ్చిన ఆసుపత్రిపై దాడికి దిగి, అక్కడి సిబ్బందిని చావగొట్టారు. అయితే పోలీసుల చొరవతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 


మధుపూర్ నివాసి, ఆ శివువు నాయనమ్మ రేఖాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఆ ఆసుపత్రిలో తమ కోడలికి ప్రసవం అయ్యిందని, శిశువు చనిపోయాడని వైద్యులు తెలిపారన్నారు. అయితే ఆ శిశువును ఇంటికి తీసుకు వెళ్లిపోయాయని, ఆ తరువాత ఆ శిశువును ఖననం చేసే సమయంలో ఊహించని విధింగా శిశువు ఏడవసాగిందని తెలిపారు. దీంతో తప్పుడు సమాచారమిచ్చిన వైద్యులను నిలదీశామని తెలిపారు. అయితే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవానంద్ ప్రకాష్... ఆ శిశువు సంబంధీకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-18T12:39:21+05:30 IST