క్లినికల్‌ పరిశోధనలకు ఊతమివ్వాలి: మజుందార్‌ షా

ABN , First Publish Date - 2020-07-04T06:41:15+05:30 IST

దేశంలో క్లినికల్‌ పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించటంతో పాటు ఊతమివ్వాలి. భారత్‌కు ప్రస్తుతం క్లినికల్‌ పరిశోధన ఒక పెద్ద అవకాశమని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు

క్లినికల్‌ పరిశోధనలకు ఊతమివ్వాలి: మజుందార్‌ షా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో క్లినికల్‌ పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించటంతో పాటు ఊతమివ్వాలి. భారత్‌కు ప్రస్తుతం క్లినికల్‌ పరిశోధన ఒక పెద్ద అవకాశమని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. క్లినికల్‌ పరీక్షలు, వినూత్న రసాయన సమ్మేళనాలు, కొత్త ఔషధాలు, చికిత్స విధానాలు ఆవిష్కరించగలవని ఫిక్కీ ఫ్లో, హైదరాబాద్‌ చాప్టర్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు.‘ప్రస్తుతం మనం కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, ప్లాస్మాథెరఫీ వంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇటువంటి వాటిని క్లిష్టమైన పరిశోధన వల్లే ఆవిష్కరించగలుగుతాం’ అని అన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్‌ అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత మెరుగ్గా ప్రాసెస్‌లను తీర్చిదిద్దడానికి సమగ్ర టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - 2020-07-04T06:41:15+05:30 IST