ఉదయం మూశారు.. సాయంత్రం ఎత్తారు

ABN , First Publish Date - 2020-08-13T10:34:55+05:30 IST

జూరాల ప్రాజెక్టు గేట్లు మూడో సారి తెరుచుకున్నాయి. బుధవారం ఉదయం వరద నీరు తగ్గిపోవడంతో గేట్లను మూసి

ఉదయం మూశారు.. సాయంత్రం ఎత్తారు

జూరాల ఐదు గేట్ల ద్వారా 20,890 క్యూసెక్కులు విడుదల


గద్వాల, ఆగస్టు 12 ( ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు గేట్లు మూడో సారి తెరుచుకున్నాయి. బుధవారం ఉదయం వరద నీరు తగ్గిపోవడంతో గేట్లను మూసి వేశారు. సాయంత్రం ఆల్మట్టికి భారీగా వరద నీరు రావడం ప్రారంభమైంది. 1,26,000 క్యూసెక్కుల వరద రావడంతో నారాయణపూర్‌కు 80 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి వరద వస్తుండడంతో నారాయణపూర్‌ నుంచి తొలుత 64 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు ఆల్మట్టికి భారీగా వరద వస్తుందని, నారాయణపూర్‌ ప్రాజెక్టును వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో నారాయణపూర్‌ ప్రాజెక్టు 14 గేట్లు తెరిచి 1,22,200 క్యూసెక్కులను విడుదల చేశారు. నారాయణపూర్‌ నుంచి విడుదల చేసిన వరద జూరాలకు చేరడానికి 48 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో వరద నీరు పెరిగితే ఇబ్బంది అవుతుందని భావించిన జూరాల అధికారులు బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మళ్లీ ఐదు గేట్లను తెరిచారు. 20,890 క్యూసెక్కులను విడుదల చేశారు. 

Updated Date - 2020-08-13T10:34:55+05:30 IST