Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూతపడిన పర్యాటక ప్రాంతాలు

విశాలాక్షినగర్‌/ ఆరిలోవ, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పలు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెన్నేటి పార్కులోకి సందర్శకులను అనుమతించలేదు. తుఫాన్‌ ప్రభావం ముగిసే వరకు పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవని అధికారులు తెలిపారు.


ఆదివారం వరకు జూకు సెలవు 

తుఫాన్‌  నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులు ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను మూసివేసినట్టు క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు. సందర్శకులు ఈ విషయం గమనించాలని కోరారు. కాగా కంబాలకొండ పార్కును శనివారం ఒక్కరోజు మూసివేస్తున్నట్టు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.  

Advertisement
Advertisement