హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగులు, ప్రయివే టు టీచర్లు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అతి పెద్ద నియంత సీఎం కేసీఆర్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించారని, ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్నారు. ఎలక్షన్, కలెక్షన్ ఉంటే చాలనుకునే కేసీఆర్‌కు కౌలు రైతు లు, నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్ల ఆత్మహత్యలు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.