కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర: భట్టి

ABN , First Publish Date - 2021-11-26T00:18:56+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసి

కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర: భట్టి

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసి, వారి భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుల కొద్దీ వరి కల్లాలలో ఉండడంతో రైతులు తీవ్ర ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వరి తప్ప మరో పంట పండని భూమిల్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు పండిన వడ్లు కొనుగోలు చేయడం పక్కన పెట్టి, ఎండాకాలం వడ్ల కొనుగోలుపై కేసీఆర్ మాట్లాడుతున్నాడన్నాడు.


ఒక క్వింటాల్‌కు ఐదు రూపాయల చొప్పున రైతు నష్టపోతున్నాడన్నారు. కల్లాలలో వడ్లు మొలకలెత్తుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేసే ముందు వర్షాకాలపు వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించి చాలాసార్లు యూ టర్న్ తీసుకున్నారని ఆయన ఆరో్పించారు. 



Updated Date - 2021-11-26T00:18:56+05:30 IST