కేటీఆర్‌.. నోరు దగ్గర పెట్టుకో

ABN , First Publish Date - 2021-10-24T08:17:11+05:30 IST

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవాళ్లే ఉంటారే తప్ప గాడ్సేలు ఉండరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ..

కేటీఆర్‌.. నోరు దగ్గర పెట్టుకో

  • కేసీఆర్‌ ఢిల్లీ మంతనాల సంగతేమిటి?
  • బీజేపీలో టీఆర్‌ఎస్‌విలీనచర్చలా: భట్టి


హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవాళ్లే ఉంటారే తప్ప గాడ్సేలు ఉండరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయని, ఆ రెండూ కలిసే దళత బంధును ఆపాయని ఆరోపించారు. ఈటల అవినీతిపై ప్రభుత్వ విచారణ ఎటుపోయిందని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి చేస్తున్న మంతనాలు ఏంటి? టీఆర్‌ఎ్‌సను బీజేపీలో కలిపేసే చర్చలు జరిగాయా?’’ అని  భట్టి ప్రశ్నించారు. హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఫ్లెక్సీలతో నింపారని, ప్రతిపక్షాలు ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారని భట్టి ప్రశ్నించారు. 


కాంగ్రెస్‌లోకి 15 మంది ఎమ్మెల్యేలు

గాంధీభవన్‌పై కంటే సొంత పార్టీపైన దృష్టిపెడితే మంచిదంటూ కేటీఆర్‌కు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ సూచించారు. ఉప ఎన్నిక తర్వాత కనీసం 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరతారని పేర్కొన్నారు. ఈ ఫిరాయింపులు ఆపలేక రేవంత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ సీనియర్‌ నేతలూ కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లడగాలి కానీ.. కాంగ్రెస్‌ మీద పడి ఏడవడం ఎందుకని మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. అసలు సిసలు గాడ్సే ప్రగతిభవన్‌లోనే ఉన్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమెత్తారు. కాగా, రేవంత్‌ను కోతి అంటూ మాట్లాడిన కేటీఆర్‌ కుసంస్కారి అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో వారు  మీడియాతో మాట్లాడారు. సోనియాకే వెన్నుపోటు పొడిచిన నైజం కేసీఆర్‌దని విమర్శించారు. 

Updated Date - 2021-10-24T08:17:11+05:30 IST