‘క్లబ్‌ హౌస్‌’ వాయిస్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-02-06T05:53:46+05:30 IST

వాట్సాప్‌ నిబంధనల పుణ్యమా అని పలు సోష్‌ మీడియా యాప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘క్లబ్‌ హౌస్‌’ ఒకటి. ఏడాది క్రితం ప్రారంభం అయిన

‘క్లబ్‌ హౌస్‌’ వాయిస్‌ యాప్‌

వాట్సాప్‌ నిబంధనల పుణ్యమా అని పలు సోష్‌ మీడియా యాప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘క్లబ్‌ హౌస్‌’ ఒకటి. ఏడాది క్రితం ప్రారంభం అయిన యాప్‌ ఇది. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కూడా దీనిపై ఓ ‘ట్వీట్‌’ చేశాడు కూడా. దీంతో ఈ యాప్‌కు ఒక్కసారి డిమాండ్‌ పెరిగింది. గత వారం రోజుల్లో దీనిని పదకొండు లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 


‘క్లబ్‌హౌస్‌’ వాయిస్‌ ఆధారిత యాప్‌. ఒక్కసారి ఇందులో చేరితే చాలు, ఆసక్తికి అనుగుణంగా చాట్‌ ఇన్‌-ఔట్‌కు అవకాశం కలుగుతుంది. అలాగే వేర్వేరు సముదాయాల నుంచి సమాచారాన్ని తెలుసుకునే వీలూ ఉంటుంది. 


 మెంబర్‌ ఆహ్వానం మేరకే ‘క్లబ్‌ హౌస్‌’లో చేరాల్సి ఉంటుంది. నేరుగా చేరే అవకాశం లేదు. ఒక మెంబర్‌ ఇద్దరికి మాత్రమే ఆహ్వానం పలకవచ్చు. ఐఫోన్‌ వినియోగదారులు - ఐఔస్‌ పైనే ప్రస్తుతం ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని యూజర్‌ నేమ్‌ను రిజర్వు చేసుకోవాలి. క్లబ్‌లో చేరేందుకు అనుమతి ఎప్పటికి లభిస్తుందన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అందుకోసం వెయిట్‌ చేయడం తప్ప గత్యంతరం లేదు.


ఒకసారి లోపలికి చేరితే, అక్కడ చర్చించుకునే  అంశాలను ఫాలో కావచ్చు. అంశాలను అనుసరించి వేర్వేరు రూమ్‌లు ఉంటాయి. మన ఇష్టాన్నిబట్టి వాటిలో చేరి అందులో ఉండే వ్యక్తులు, స్నేహితుల అభిప్రాయాలను వినవచ్చు.  ప్రతి రూమ్‌కు ఉండే మోడరేటర్‌ను ఫైనల్‌ అథారిటీగా వ్యవహరిస్తారు. వినియోగదారులు ఏమైనా చెప్పాలని అనుకుంటే చేయి ఎత్తవచ్చు. అయితే మోడరేటర్‌ అవకాశం ఇస్తేనే మాట్లాడాల్సి ఉంటుంది. యావత్తు వ్యవహారం కనెక్ట్‌ అయ్యే వ్యక్తులు, అక్కడ చర్చించే అంశాన్ని బట్టి ఉంటుంది. 


Updated Date - 2021-02-06T05:53:46+05:30 IST