క్లబ్‌హౌస్‌ ‘మ్యూజిక్‌ మోడ్‌’

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

లైవ్‌ మ్యూజిక్‌ వినేందుకు వీలుగా క్లబ్‌హౌస్‌ మ్యూజిక్‌ మోడ్‌ను ఆరంభిస్తోంది. వినడానికి తోడు ప్లే చేసేందుకు కూడా ఇది సహకరిస్తుంది.....

క్లబ్‌హౌస్‌ ‘మ్యూజిక్‌ మోడ్‌’

లైవ్‌ మ్యూజిక్‌ వినేందుకు వీలుగా క్లబ్‌హౌస్‌ మ్యూజిక్‌ మోడ్‌ను ఆరంభిస్తోంది. వినడానికి తోడు ప్లే చేసేందుకు కూడా ఇది సహకరిస్తుంది. ‘ద వెర్జ్‌’ ప్రకారం కొత్తగా తీసుకువస్తున్న మ్యూజిక్‌ మోడ్‌తో మంచి క్వాలిటీకి తోడు స్టీరియో సౌండ్‌తో మ్యూజిక్‌ వినొచ్చు. బ్రాడ్‌కాస్ట్‌ సమయంలోనే యూఎస్‌బీ మిక్‌ లేదా మిక్సింగ్‌ బోర్డును తగిలించవచ్చు. మ్యూజిక్‌ మోడ్‌ కోసం రూమ్‌ రైట్‌ కార్నర్‌ టాప్‌లో ఉన్న మూడు డాట్స్‌ని టాప్‌ చేయాలి. 

ఆడియో క్వాలిటీని తదుపరి మ్యూజిక్‌ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. మ్యూజిక్‌ మోడ్‌ మొదట ఐఓఎస్‌లో అందుబాటులోకి వస్తుంది. తదుపరి ఆండ్రాయిడ్‌కూ కొనసాగిస్తారు.

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST