వికృతప్రేమ

ABN , First Publish Date - 2021-06-05T07:57:12+05:30 IST

ఏడాదిగా ప్రేమించమని వెంటపడ్డాడు..అతని వ్యవహార శైలి నచ్చని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీర్ణించుకోలేని ఆ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.

వికృతప్రేమ
సుస్మిత(ఫైల్‌ఫొటో)

ప్రేమించలేదని పొడిచి చంపేశాడు

ఆపై భయంతో గొంతుకోసుకున్న యువకుడు

 చివరకు అమ్మాయి తమ్ముడి చేతిలో హతం

 సాంబయ్యకండ్రిగ హౌసింగ్‌ కాలనీలో విషాదఛాయలు


చిత్తూరు, జూన్‌ 4: ఏడాదిగా ప్రేమించమని వెంటపడ్డాడు..అతని వ్యవహార శైలి నచ్చని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  జీర్ణించుకోలేని ఆ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.తర్వాత భయంతో తాను కూడా గొంతుకోసుకుని అక్కడే పడిపోయాడు. అక్క విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేని ఆ అమ్మాయి తమ్ముడు అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి తలపై బండరాయితో మోదాడు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.... చిత్తూరు శివారు ప్రాంతంలోని సాంబయ్య కండ్రిగ హౌసింగ్‌ కాలనీలో భాస్కర్‌ కుటుంబం నివాసముంటోంది. హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న భాస్కర్‌ ఇంటి సమీపంలోనే చిన్నా(23) అనే యువకుడు ఉంటున్నాడు.ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న చిన్నా ఏడాది నుంచి భాస్కర్‌ కుమార్తె సుస్మిత(21)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు.ఇంట్లో తెలిస్తే ఇబ్బందులొస్తాయనుకున్న సుస్మిత తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ ఏడాది జనవరిలో సుస్మితకు గుడిపాల మండలం చీలాపల్లె వద్ద ఉన్న సీఎంసీ ఆస్పతిల్రో స్టాఫ్‌ నర్స్‌గా ఉద్యోగం వచ్చింది.రెండు నెలల క్రితం సీఎంసీ ఆస్పత్రి వద్దకు వెళ్లి మరీ సుస్మితను చిన్నా వేధించాడు.దీంతో గుడిపాల పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని పిలిచించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.ఇదంతా భరించలేకపోయిన చిన్నా శుక్రవారం ఉదయం డ్యూటీ ముగించుకుని సుస్మిత ఇంటికి రావడం గమనించాడు.తండ్రి పనికి వెళ్లిపోగా తల్లి పక్కనే కూరగాయలు కొనుక్కోవడానికి గేటుకు తాళం వేసుకుని వెళ్లింది. ఇదంతా గమనిస్తున్న చిన్నా సమీపంలో ఉన్న ఇంటి మెట్లపైకి ఎక్కి రెండు ఇళ్లను దాటుకుని సుస్మిత ఇంటిలోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో నిద్రపోతున్న  సుస్మిత గొంతు, మెడ, కడుపుపై విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో సుస్మిత అక్కడికక్కడే మృతి చెందింది. తానేం చేశాడో తెలిశాక భయంతో చిన్నా కూడా గొంతుకోసుకుని ఇంటి బయటికి వచ్చి  పడిపోయాడు.అక్క అరుపులు విన్న సుస్మిత తమ్ముడు  ఇంట్లోకి వెళ్లి ఆమె చనిపోయి ఉండడాన్ని చూశాడు.కోపంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నా తలపై బండరాయితో మోదాడు. దాంతో చిన్నా కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.డీఎస్పీ సుధాకరరెడ్డి,సీఐ నరసింహరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-06-05T07:57:12+05:30 IST