పెరిగిపోతున్న కేసులు.. సీఎం ఆల్ పార్టీ మీట్

ABN , First Publish Date - 2021-04-10T21:51:43+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేడు అన్ని పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. కరోనా నియంత్రణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తోంది

పెరిగిపోతున్న కేసులు.. సీఎం ఆల్ పార్టీ మీట్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేడు అన్ని పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. కరోనా నియంత్రణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తోంది.


ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఉన్న వీధులు, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వారాంతపు లాక్‌డౌన్ వల్ల నిర్మానుష్యంగా మారుతున్నాయి. కాగా మహారాష్ట్రలో ఒక్కరోజే 58,993కొత్త కేసులు నమోదవగా, 301 మంది వైరస్ బారిన పడిన ప్రాణాలు కోల్పోయారు.


దేశంలో గడిచిన 24 గంటల్లో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగోరోజు కేసులు సంఖ్య లక్ష మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది.


Updated Date - 2021-04-10T21:51:43+05:30 IST