దెబ్బతిన్న పంటలను పరిశీలించిన CM

ABN , First Publish Date - 2021-11-23T18:17:57+05:30 IST

వర్షపీడిత ప్రాంతాల్లో ఒకటైన కోలారు జిల్లాలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సోమవారం పర్యటించారు. కోలారు తాలూకాలోని ముదువాడి చెరువు, చౌడదేవనహళ్లిని సందర్శించి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన CM

- కోలారు జిల్లాలో పర్యటన 

- బాధితులను ఆదుకుంటామని భరోసా


బెంగళూరు: వర్షపీడిత ప్రాంతాల్లో ఒకటైన కోలారు జిల్లాలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సోమవారం పర్యటించారు. కోలారు తాలూకాలోని ముదువాడి చెరువు, చౌడదేవనహళ్లిని సందర్శించి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. చౌడేనహళ్లిలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. స్థానికుల సమస్యలు ఆలకించారు. కోలారు జిల్లాలో 48 వేల హెక్టార్లలో రాగి, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతినగా 7వేల హెక్టార్లలో తోటలు, కూరగాయలు దెబ్బతిన్నాయి. జిల్లాలో అత్యధికంగా టమోటా, కోసు, నూలుకోలు, కందులు, క్యారెట్‌, బీట్‌రూట్‌, బీన్స్‌, కాకరకాయ, కొత్తిమీర, చేమంతి ఇతర రకాల పూలు సాగు చేస్తారు. పంటనష్టంపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ నీరు ఇంట్లో చేరి నష్టం వాటిల్లినవారికి రూ.10వేలు, పూర్తిగా నష్టపోయినవారికి రూ.95 వేలు పరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఇళ్లు నేలమట్టమైనవారికి రూ.5 లక్షలు, పాక్షికంగా నష్టపోయినవారికి రూ.50వేలు పరిహారం ఇవ్వనున్నట్టు వివరించారు. మంత్రి మునిరత్న, ఎంపీ మునిస్వామి, ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు రమేశ్‌కుమార్‌, శ్రీనివాసగౌడ, జిల్లా అధికారి సెల్వమణి తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T18:17:57+05:30 IST