Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు : బీజేపీ

కందుకూరు: పాలనలో విఫలమైన సీఎం కేసీఆర్‌ కే ంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ, బీజేపీ మండల అధ్యక్షుడు అనేగౌని అశోక్‌గౌడ్‌ ఆరోపించారు. మంగళవారం కూడళ్లలో ర్యాలీ నిర్వహించి హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం గా ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రిపై దుర్భాషలాడడం తగదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అంజిరెడ్డి, మహేందర్‌, కృష్ణకుమార్‌, దిలీప్‌, వెంకటేష్‌, ఎస్‌.భూమిరెడ్డి, ప్రభాకర్‌, రామకృష్ణ, కె.సుధాకర్‌రెడ్డి, పర్వతాలు, జవహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement