సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

ABN , First Publish Date - 2020-04-04T12:11:41+05:30 IST

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

చెన్నై,(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నిరోధక చర్యలు, కరోనా బాధితులకు మెరుగైన సేవలు, లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ సంస్థలు, ప్రముఖుల నుంచి విరివిగా విరాళాలు జమ అవుతున్నాయి. ఈ నెల 1, 2 తేదీల్లో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 25.96 కోట్ల మేరకు విరాళాలు అందినట్లు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేసింది. మార్చి 31 వరకూ రూ.36 కోట్ల 34 లక్షల 2 వేల 529లు మేరకు విరాళాలు అందాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి శుక్రవారం వరకూ విరాళాలు ఇచ్చిన సంస్థలు, ప్రముఖల పేర్లను కూడా ఆ ప్రకటనలో తెలిపారు.  

 సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ రూ.4 కోట్లు, టాఫే రూ.3 కోట్లు, రామ్‌కో సిమెంట్స్‌ రూ.2.50 కోట్లు, వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూ.1.25 కోట్లు, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు జయప్రదీప్‌ రూ.కోటి, టాఫే ఇందన సంస్థ, సుందరం హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థ, చారిటీస్‌ ఎయిడ్‌ ఫౌండేషన్‌ ఇందియా సంస్థ తలా కోటి రూపాయలు చొప్పున విరాళాలు ప్రకటించాయి. ఇదే విధంగా ఎంఎస్‌ వీల్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఇండియా మోటార్స్‌ అండ్‌ అక్చరీస్‌, యాక్సిల్స్‌ ఇండియా లిమిటెడ్‌, రాశి చిట్స్‌ సంస్థ తలా రూ.50 వేలు చొప్పున విరాళాలు ప్రకటించాయి. సియో టెక్నాలజీ ఇండియా లిమెటెడ్‌, సుందరం అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, శ్రీపతి అసోసియేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు తలా రూ.25 వేలు చొప్పున విరాళాలు అందించాయి. రూట్స్‌ ఆటో ప్రాడక్ట్స్‌ రూ.25 లక్షలు, కాళీశ్వరీ రిఫైనరీస్‌ రూ.24.90లక్షలు, రాజ్‌కుమార్‌ సేతుపతి రూ.15 లక్షలు, మరుదుపాండియా కళాశాల రూ.12 లక్షలు, ధర్మపురం ఆధీనం సంస్థ రూ.11 లక్షలు, ఎస్కేఎం ఎగ్‌ ప్రాడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థ, కృష్ణా జువెలరీ, వీఎస్పీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, పి.గుణబాలన్‌, మహాత్మాగాంధీ సెంటినరీ విద్యాలయం, బ్లెస్సింగ్‌ టీవీ, ఎస్‌ఎం ఇంజనీరింగ్‌ వర్క్స్‌ సంస్థ తలా రూ.10లక్షలు చొప్పున విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విరాళాలతో ఇప్పటివరకూ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.62 కోట్ల 30 లక్షల 19 వేల 538లు వచ్చినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.


వృద్ధులు, దివ్యాంగులకు టోల్‌ఫ్రీ నెంబర్‌...

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు తగు సహాయకాలు పొందటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ప్రీ నెంబర్‌ ఏర్పాటుచేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, లేక సహాయం అవసరమైనా 18004250111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ప్రకటిచింది. ఇదే విధంగా బధిరులు 9700799993 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. ఈ రెండు నెంబర్‌లు 24 గంటలపాటు పనిచేస్తాయన్నారు. కరోనా వ్యాప్తి, చికిత్సకు సంబంధించి వృద్ధులు, దివ్యాంగులకు ఏవైనా అనుమానాలుంటే 044-28590804, 044-28599188 ఫోన్‌ నెంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోగా ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-04T12:11:41+05:30 IST