Abn logo
Apr 8 2020 @ 05:25AM

కరోనా నియంత్రణలో సీఎం విఫలం

అందుబాటులో లేని మాస్క్‌లు, శానిటైజర్లు

కార్డుదారులకు కేంద్రం ఇస్తున్న రూ.1000 తామే ఇస్తున్నట్లు వైసీపీ నాయకుల ప్రచారం

కరోనా పరిస్థితుల్లో కాంట్రాక్టర్లకు రూ. 6 వేల కోట్ల విడుదల అవసరమా?

మాజీ మంత్రి అఖిల ప్రియ


ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 7: చైనాలో పుట్టి లక్షల మంది మరణాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఏపీలో అరికట్టడం లో సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యా రని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపిం చారు. మంగళవారం ఆంధ్రజ్యోతితో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ కరోనాను అరికట్టేం దుకు దేశంలోని రాష్ట్రాల సీఎంలు ప్రజల ఇళ్లవద్దకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంటే సీఎం జగన్‌ ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటూ లాక్‌డౌన్‌లో కొంత సమ యాన్ని నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కేటాయించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు రూ. 1000 మంజూరు చేసిందని, కానీ ఈ నిధులను తామే ఇచ్చినట్లు వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటు న్నారని ఆరోపించారు.


ఈ నిధులను ప్రజలకు ఇవ్వడంలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారని, పైగా ఈ నిధులు ఇస్తున్నందుకు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని వైసీపీ నాయకులు ప్రజలను అడుగుతున్నారన్నారు. రైతులు తమ పంటలు అమ్ముకునేందుకు అవకాశం లేక ఇబ్బంది పడుతు న్నారని, ఈ పరిస్థితుల్లో పంట దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కరోనాను అరికట్టేందుకు వైద్యులు, పోలీసులు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, ఉద్యోగులు కష్టపడుతున్నా రని, వీరికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు అందిచకపోవడంతో వారికి రక్షణ కరువైందని అన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు 74 పెరిగా యని, ఇందుకు ప్రభుత్వమే కారణమని అన్నారు.


కరోనా వైరస్‌ వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం జగన్‌ గుత్తేదారులకు రూ. 6 వేల కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని, ఈ నిధులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కార్డుదారులకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు ఇస్తే బాగుండేదని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు కృషి చేస్తున్న అధికారులకు జీతాలు కట్‌ చేయడం సరికాదని, వారందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అత్యవసర సమయాల్లోనే బయటకురావాలని మాజీ మంత్రి అఖిలప్రియ సూచించారు.Advertisement
Advertisement
Advertisement