Abn logo
Aug 3 2021 @ 16:23PM

ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాలకు సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు ఉండనున్నట్లు సీఎం తెలిపారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటి విడతలో 4530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్‌ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కంప్యూటర్‌ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.