రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-11-16T03:06:29+05:30 IST

రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని సీఎం ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని సీఎం ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 46 వేల కి.మీ. రోడ్ల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సీఎం సూచించారు. 2022 జూన్‌ కల్లా రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తికావాలన్నారు. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మతులు ఒక డ్రైవ్‌లా చేయాలని సీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-16T03:06:29+05:30 IST