Advertisement
Advertisement
Abn logo
Advertisement

గృహనిర్మాణ, ఓటీఎస్ పథకాలపై సీఎం Jagan సమీక్ష ప్రారంభం

అమరావతి: గృహనిర్మాణ, ఓటీఎస్ పథకాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ పథకంపై  అటు విపక్షాలు, ఇటు లబ్దిదారులు వ్యతిరేకిస్తుండడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఓటీఎస్ పథకంపై ఉద్యోగులకు టార్గెట్ విధించడం... ఆ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఓటీఎస్‌పై విమర్శల నేపథ్యంలో పథకంలో మార్పులు చేర్పులు ఉంటాయా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రి శ్రీరంగనాగరాజు, సంబంధిత శాఖా ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. 

Advertisement
Advertisement